ప్రముఖ మలయాళ సినీ నటి వాసంతి మృతి

  • క్యాన్సర్ తో కన్నుమూసిన నటి వాసంతి
  • ఆమె వయసు 65 ఏళ్లు
  • 400కు పైగా సినిమాల్లో నటించిన అలనాటి నటి
ప్రముఖ మలయాళ సినీ నటి తొడుపూజ వాసంతి తుదిశ్వాస విడిచారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి వల్ల ఆమె శరీరంలోని కొన్ని భాగాలు పని చేయకపోవడంతో... ఈ నెల 24న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా ఉంది. ఈ ఉదయం ఆమె మరణించారు. ఆమె వయసు 65 ఏళ్లు. నాలుగు దశాబ్దాల కాలంలో ఆమె 400కు పైగా సినిమాల్లో నటించారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 
Go Back to Shorts
todupooja vasanthi
malayalam actress

More Telugu News